అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బిడెన్ (54) పన్ను ఎగవేత కేసులో నేరాన్ని అంగీకరించారు. దాదాపు $1.4 మిలియన్ల పన్ను ఎగవేసినట్లు ఒప్పుకున్నారు. విలాసవంతమైన జీవనం, సెక్స్ వర్కర్లు, మాదకద్రవ్యాల వంటి తొమ్మిది విషయాల కోసం ఆయన ఈ డబ్బును ఉపయోగించుకున్నట్లు తెలిపారు. దీంతో ఆయనకు దాదాపు 17 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.