జగన్ సొంత జిల్లా కడపలో ఆయన రాజకీయ బలాన్ని దెబ్బ తీయడం ద్వారా చతికిలపడేలా చేయాలని టీడీపీ కూటమి భారీ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా ప్రచారం సాగుతోంది. కడప జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నికను దీని కోసం సరైన వేదికగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కడప జెడ్పీ చైర్మన్ పీఠం మీద ఎలాగైనా కూటమి అభ్యర్ధిని కూర్చోబెట్టాలన్నది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పెద్దల ఆలోచన. దాంతో వైసీపీ కూడా అలెర్ట్ అయింది. జగన్ అయితే కడప జెడ్పీ సీటు ప్రతిష్టాత్మకం కాబట్టి తాడేపల్లిలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.