వదరతో భారీ నష్టం జరిగిన విజయవాడ నగరంలో క్రమేణా పరిస్థితులు మెరుగవుతున్నాయి. ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తోంది. నగరంలో బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్ల ను పిలిపించాలని సీఎం నిర్దేశించారు.