వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ మొదలు..!

575చూసినవారు
వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ మొదలు..!
ఏపీని వర్షాలు వీడటం లేదు. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సెప్టెంబర్‌ 9 నాటికి వాయువ్య బంగాళాఖాతం, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని కారణంగా కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తరాంధ్రలోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్