నీట మునిగిన మహదేవ ఆలయం (వీడియో)

83చూసినవారు
గత కొద్ది రోజులుగా కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. పై నుంచి బాగా వరద వస్తుండటంతో పెరియార్‌ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పెరియార్ నది వరద నీటిలో అళువాలోని మనప్పురం శ్రీ మహదేవ ఆలయం మునిగింది. ఆలయం దగ్గర వరద వేగం పెద్దగా లేకపోవడంతో అర్చకులు భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్