నాసా వ్యోమగాములు సునీతా విలయమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి వచ్చే ప్రయాణం ఖరారైన సంగతి తెలిసిందే. అయితే జీరో గ్రావిటీ ఉండే స్పేస్ నుంచి గురుత్వాకర్షణ కలిగిన భూమిపైకి వచ్చాక వారికి అనేక ఇబ్బందులు ఎదురవనున్నాయి. చిన్న పెన్సిల్ ఎత్తినా అది వర్కౌట్‌తో సమానమవుతుందని విల్మోర్ తెలిపారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం చాలా కష్టంగా ఉంటుందని సునీత చెప్పారు.