లాస్ ఏంజెలిస్ కార్చిచ్చును ఆపేందుకు కెనడా సహకారం అందించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి చెందిన 'సూపర్ స్కూపర్స్' మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నాయి. ఇవి ల్యాండింగ్ అవసరం లేకుండానే నేరుగా సముద్రాలు, నదులు, సరస్సుల నుంచి కేవలం 12 సెకన్లలోనే 6వేల లీటర్ల నీటిని సేకరిస్తాయి. అనంతరం గంటకు 350 కి.మీ వేగంతో దూసుకెళ్తూ 100 అడుగుల పైనుంచి మంటలపై నీటిని చల్లుతాయి. హెలికాప్టర్ల కంటే ఎంతో వేగంగా పని చేస్తాయి.