సురేశ్ గోపీ వ్యాఖ్యలు ఫేక్

67చూసినవారు
సురేశ్ గోపీ వ్యాఖ్యలు ఫేక్
కేంద్ర మంత్రి ప‌ద‌విపై మలయాళ నటుడు స‌రేశ్ గోపీ అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కేర‌ళ బీజేపీ అధ్య‌క్షుడు కే సురేంద్ర‌న్ ఖండించారు. కొంద‌రు జ‌ర్న‌లిస్టులు కేర‌ళ బీజేపీ యూనిట్‌పై దుష్ప్ర‌చారం చేస్తున్న‌ట్లు ఆరోపించారు. త్రిసూర్ లోక్‌స‌భ స్థానం నుంచి సురేశ్ గోపీని ఓడించాల‌ని కేర‌ళ బీజేపీ యూనిట్ ప్లాన్ చేసిన‌ట్లు మీడియాలో త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేసిన‌ట్లు కూడా సురేంద్ర‌న్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్