నటుడు సూర్య, నటి కాజల్ అగర్వాల్ ముంబై ఎయిర్‌పోర్టులో కలిశారు. ఈ సందర్భంగా తన భర్త గౌతమ్ కిచ్లూ, కొడుకు నీల్ కిచ్లూను ఆయనకు పరిచయం చేశారు. నీల్‌ను సూర్య ప్రేమగా ముద్దు చేశారు. అనంతరం వారితో కలిసి ఫొటో దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, సూర్య, కాజల్ కలిసి బ్రదర్స్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.