ఎయిర్‌లైన్స్‌ సీఈవోలతో BCAS భేటీ

70చూసినవారు
ఎయిర్‌లైన్స్‌ సీఈవోలతో BCAS భేటీ
దేశీయ, విదేశాలకు వెళ్లే పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ‘బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ’ (BCAS) అప్రమత్తమైంది. ఢిల్లీలోని పౌర విమానయాన మంత్రిత్వశాఖ కార్యాలయంలో సీఈవోలతో BCAS సమావేశమైంది. స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ విధానాన్ని (SOP) అనుసరించాలని కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలని కోరింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్