గరిడేపల్లి మండలం - Garidepally Mandal

సూర్యాపేట జిల్లా
Oct 28, 2024, 09:10 IST/

‘దృశ్యం’ సినిమా తరహాలో శవాన్ని పూడ్చి పెట్టాడు (వీడియో)

Oct 28, 2024, 09:10 IST
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కాన్పూర్‌కు చెందిన ఏక్తా గుప్తా కనిపించడం లేదని భర్త రాహుల్ గతంలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును తాజాగా ఛేదించారు. ఏక్తా గుప్తాకు విమల్ అనే జిమ్ ట్రైనర్‌తో వివాహేతర సంబంధం ఉందని, విమల్ వేరే మహిళతో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు పోలీసులు. ఈ క్రమంలో విమల్ ఏక్తా మెడపై బలంగా కొట్టాడని, దృశ్యం సినిమా తరహాలో శవాన్ని కలెక్టర్ ఆఫీస్ పక్క స్థలంలో పూడ్చి పెట్టాడన్నారు. విమల్‌ను పట్టుకున్న పోలీసులు శవాన్ని గుర్తించారు.