ఈ ఘటనలో హీరోను ఒంటరిని చేశారు: పవన్ కళ్యాణ్
AP: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని, కింది స్థాయి నుంచి ఎదిగారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ తరహాలో సీఎం రేవంత్ వ్యవహరించలేదన్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అవకాశమిచ్చిందన్నారు. అల్లు అర్జున్ విషయంలో ముందూ వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుందని, ఈ ఘటనలో హీరోను ఒంటరిని చేశారన్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరును తప్పుబట్టలేమన్నారు.