AP: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆసక్తికర ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రజల గౌరవాన్ని, నైతిక విలువలు కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణ, దుష్ప్రచారాలు, మహిళలను అవమానించడాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అవగాహన కల్పిస్తోంది. ‘సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం.. అసత్య ప్రచారాలకు స్వస్తి పలుకుదాం.’ అని ప్రచారం చేస్తోంది.