విశాఖ సెంట్రల్ జైలు వివాదం.. 66 మందిపై బదిలీ వేటు

70చూసినవారు
విశాఖ సెంట్రల్ జైలు వివాదం.. 66 మందిపై బదిలీ వేటు
AP: విశాఖ సెంట్రల్ జైలులో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. జైలు సూపరింటెండెంట్, వార్డెన్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనిఖీల పేరుతో సూపరింటెండెంట్ వేధిస్తున్నారని వార్డెన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు జైలులో ఖైదీల నుంచి సిగరెట్లు, గంజాయి దొరికిన నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ చెబుతున్నారు. దాంతో ఈ వివాదంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 66 మందిపై బదిలీ వేటు వేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్