ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై స్పందిస్తూ.. 'తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడు. కిందిస్థాయి నుంచి ఎదిగారు. తెలంగాణలో బెనిఫిట్‌షోలకు, టికెట్ ధర పెంపు అవకాశమిచ్చారు. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. భద్రత గురించి వారు ఆలోచిస్తారు' అని అన్నారు.