నూతనకల్: బాధితులకు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లి, భాగ్య తండా, ఎర్రపహాడ్, గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఆకాల వర్షాల కారణంగా పశువుల కోల్పోయిన 9 మంది బాధితులకు రూ. 4, 83, 500 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.