ప్రతి సంవత్సరం విధిగా 35సం. నిండిన మహిళలందరూ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు తీసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. సోమవారం బ్రెస్ట్ క్యాన్సర్ పై మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన 2కె కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే దీనిని గుర్తించడం ద్వారా నివారించే అవకాశం ఉందన్నారు.