
సూర్యాపేటలో పోలీసుల విస్తృత తనిఖీలు
సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలతో పాటు, రద్దీ ప్రాంతాలు, ఫ్లైఓవర్లు, ముఖ్యమైన వాణిజ్య సముదాయాలలో పోలీసులు శుక్రవారం విసృత తనిఖీలు నిర్వహించారు. బస్సులలో ప్రయాణికుల లగేజీ, అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి భద్రతా చర్యల పట్ల పట్టణ సీఐ వీర రాఘవులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఉన్నారు.