సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. జాతీయ రహదారి 365పై దట్టమైన పొగ మంచు వల్ల వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలు పొగ మంచు కొమ్ముకోవడంతో కనిపించడం లేదని వాహనదారులు అంటున్నారు. రహదారులపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.