TG: సామాన్యులకు ‘టమాటా’ చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 చేరువవ్వడంతో టమాటాకు
టాటా చెప్పాల్సిన సమయం వచ్చిందంటున్నారు సామాన్యులు. రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఇక బహిరంగ మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయాలు సాగిస్తున్నారు.