AP: ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉపేక్షించమని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కన్నతల్లి శీలాన్నే శంకించేలా వైసీపీ నేతలు పోస్టులు పెట్టించారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలు చేసేందుకు కొందరు రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. మహిళలను కించపరిచేలా కూటమి నేతలెవరూ పోస్టులు పెట్టరని స్పష్టం చేశారు. ఒకవేళ అలా జరిగితే సొంతవారిని కూడా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.