లండన్‌లో ఆగష్టు 8, 2023న ఉర్ఫాన్ షరీఫ్ అనే వ్యక్తి.. సారా(10) అనే తన కూతురును దారుణంగా హత్య చేసి పాకిస్థాన్‌కు పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడిని 2023 సెప్టెంబర్ 13న అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తన కూతురిని తాను చంపలేదని బుకాయించి తప్పించుకున్నాడు. సుమారు ఏడాది పాటు నడిచిన ఈ కేసు.. 13 నవంబర్ 2024న తన కూతురిని చంపింది.. తానేనని కోర్టులో ఒప్పుకున్నాడు.