హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోహిత్ వేముల ఆత్మహత్యతో నాటి వీసీ అప్పారావు, మరికొందరికి సంబంధం లేదని, రోహిత్ ఎస్సీ కాదని గచ్చిబౌలి పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించడంపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు భారీగా తరలిరావడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు పోలీసు బలగాలు యూనివర్సిటీ వద్దకు చేరుకున్నాయి.