కేరళలోని కొజికోడ్‌లో విద్యార్థుల మధ్య చెలరేగిన గొడవ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పదో తరగతి విద్యార్థులు ఫెరెవల్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవలో షహబాజ్ (16)తలకు తీవ్రగాయం కాగా ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.