ఏపీలో భారీగా పింఛన్ల తొలగింపు

66చూసినవారు
ఏపీలో భారీగా పింఛన్ల తొలగింపు
AP: మార్చి నెలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మొత్తం 63,36,932 మందికి పింఛన్లు ఇస్తోంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. అయితే ఫిబ్రవరి నెలలో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 63,59,907గా ఉంది. మార్చికి వచ్చేసరికి ఆ సంఖ్య తగ్గిపోయింది. సుమారు 22,975 మంది లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. అయితే ప్రభుత్వం అనర్హులను గుర్తించి తొలగిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్