ఓ రోజు రోడ్డు మధ్యలో చనిపోయిన వీధి కుక్క మృతదేహం మీదుగానే వాహనాలు పోతుండడం గమనించాడు. ఈ దృశ్యం చూసి శంతను చలించిపోయాడు. వీధి కుక్కుల సంరక్షణకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్‌ని తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కలకు వాటిని అమర్చాడు. స్థానికుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అలా ‘మోటోపాస్’ స్టార్టప్ ఆలోచన పురుడుపోసుకుంది.