సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ జూలో పెద్ద బోనులో ఉన్న కోతులను చూసేందుకు చాలా మంది నిలబడి ఉన్నారు. వారిలో ఓ బాలిక ఇనుప ఊచల దగ్గరికి వెళ్లి కోతిని వీడియో తీస్తోంది. ఊచలకు వేలాడుతున్న కోతి ముందు పిచ్చి చేష్టలు చేసింది. చేత్తో కొడుతూ దాన్ని దూరంగా తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో కోతి.. ఒక్కసారిగా చేయి ఊచల మధ్యలో నుంచి బయటికి పెట్టి బాలిక జుట్టును పట్టుకుంటుంది.