భారత ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ కెనడా కొత్త ప్లాన్ చేస్తోంది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్లాన్ చేసిన విషయం ప్రధాని మోదీకి ముందే తెలుసు అంటూ కెనడాకు చెందిన ఓ మీడియా పేర్కొంది. ఈ తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వార్తలు హాస్యాస్పదమని, వీటిపై అధికారులు కచ్చితంగా జవాబు ఇవ్వాలని తెలిపింది. తప్పుడు ప్రచారాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని పేర్కొంది.