వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్త సురేశ్ కుట్ర చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి సమయంలో సురేశ్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి 42 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో నరేందర్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసిట్లు వార్తలు వినిపించాయి. కాగా, ఇవాళ ఉదయం నరేందర్ రెడ్డిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.