ఆహారం నిరాకరించారని ట్రక్కుతో హోటల్లోకి దూసుకెళ్లిన డ్రైవర్.. కారు ధ్వంసం

58చూసినవారు
తనకు తినేందుకు ఆహారం ఇవ్వలేదని పుణెలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్, హోటల్లోకి పలుమార్లు ట్రక్కును నడిపి, ఆ భవనాన్ని నాశనం చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో హోటల్ ముందున్న కారు ధ్వంసమైంది. షోలాపూర్ నుంచి పుణెకు వెళ్తున్న డ్రైవర్, భోజనం కోసం హింగన్ గావ్ సమీపంలో ఓ హోటల్ వద్ద ఆగాడని సమాచారం. ఆ యజమాని ఆహారం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన డ్రైవర్, ట్రక్కుని హోటల్లోకి నడిపాడని తెలుస్తోంది.