విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఇంతకన్నా ఎక్కువగానే వరదలు ముంచెత్తినప్పుడు వంగవీటి రంగ విజయవాడను కాపాడిన సంఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 1980, 1983ల్లో వరదలు విజయవాడను ముంచేశాయి. ఇప్పటి మాదిరిగా ప్రభుత్వం విజయవాడలో ఉండేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు కొనసాగేవి. దీంతో సర్కారుకు ఈ వరదల విషయం తెలిసేలోపే వంగవీటి రంగా రంగంలోకి దిగి ప్రజలను కాపాడారని విజయవాడ వాసులు చెబుతున్నారు.