తన తండ్రి కొడుతున్నాడని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక తన తండ్రి పెట్టే చిత్రహింసలు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి కరోనా సమయంలో చనిపోగా తండ్రి మరోక వివాహం చేసుకున్నాడని పోలీసులకు తెలిపింది. ఈ మధ్య తన తండ్రి రోజు కొడుతున్నాడని, ఆ గాయాలను పోలిసులకి చూపిస్తూ తన గోడు వెళ్ళబోసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.