కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకులు.. వీడియో

78చూసినవారు
యూపీలోని ఘాజీపూర్‌లో ఓ ఇద్దరు యువకులు ఖరీదైన కారుకు నిప్పంటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా ఈ ఘటన గత నెల 13న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ముసుగు వేసుకుని ఉన్న ఓ యువకుడు అర్ధరాత్రి 1 గంట సమయంలో పార్కింగ్ చేసిన కారుపై పెట్రోల్ పోసి వెళ్లాడు. ఆ తర్వాత వచ్చిన మరో యువకుడు కారుకు నిప్పంటించాడు. దీంతో కారు స్వల్పంగా కాలిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్