AP: నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప, తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గత ఐదేళ్లలో, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారు. రాష్ట్రాన్ని రీ బిల్డ్ చేసి, అభివృద్ధి పథంలో నడిపించడమే నా లక్ష్యం' అని చంద్రబాబు పేర్కొన్నారు.