కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో ఇప్పటి వరకూ విచారణ వేగవంతం కాకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ స్పందించారు. దీనిపై వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌భవన్ కార్యాలయాన్ని ఆదేశించారు. బెంగాల్ సమాజంలోని వివిధ వర్గాలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో తీసుకున్న చర్యలు వారికి వివరించి.. ఆయా వర్గాల అభిప్రాయాలనూ తీసుకోనున్నారు.