ప్రముఖ రష్యన్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్, టట్యానా ఓజోలినా (38) కన్నుమూశారు. టర్కీలో బైక్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆమె బిఎమ్‌డబ్ల్యూ సూపర్‌బైక్‌పై వెళుతుండగా మిలాస్ సమీపంలో అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. స్థానిక టర్కిష్ బైకర్ ఒనూర్ ఒబుట్ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడగా మూడో బైకర్ క్షేమంగా ఉన్నాడు.