పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: పీసీసీ చీఫ్

58చూసినవారు
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: పీసీసీ చీఫ్
కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటానని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులం, మతం పేరుతో ప్రధాని మోదీ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :