ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే స్మాల్ క్యాప్ స్టాక్ భారీగా పెరిగి రికార్డు నమోదు చేసింది. అక్టోబర్ 29న పెరిగిన స్టాక్ విలువ ఏకంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోనే ఖరీదైన స్టాక్‌గా మారింది. ఈ స్టాక్ ధర ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 66,92,535 శాతం దూసుకుపోయింది. దాంతో గతంలో రూ.3.53గా ఉండే స్టాక్ ధర కాస్తా రూ.2,36,250కు చేరింది. ఇండియాలోనే ఇప్పటి వరకు ఖరీదైనా స్టాక్‌గా ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర రూ.1.2 లక్షలను మించిపోయింది.