విమానం నడుపుతున్న భర్తకు సడెన్‌గా గుండెపోటు రావడంతో ఆయన భార్య స్వయంగా విమానాన్ని ల్యాండ్ చేసింది. అమెరికాలో ఇటీవల జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎలియట్ ఆల్పర్(78) అనే వ్యక్తి తన సొంత విమానం నడుపుతుండగా అతడి భార్య పక్కన కూర్చుంది. ఇంతలో భర్తకు గుండెపొటు రావడంతో అచేతనంగా మారిపోయాడు. భార్యకు విమానం నడిపిన అనుభవం లేకున్నా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకు ఆమె విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసింది.