ప్రపంచంలోనే ఒంటరి మొక్క.. తోడు కోసం అన్వేషణ

57చూసినవారు
ప్రపంచంలోనే ఒంటరి మొక్క.. తోడు కోసం అన్వేషణ
ప్రపంచంలోనే ఒంటరి మొక్క అయిన ఎన్సెఫాలార్టోస్‌ వూడీ పునరుత్పత్తికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఈ పురుష మొక్కకు భాగస్వామిగా ఒక ఆడ మొక్కను అన్వేషిస్తున్నారు. ఈ పనికి ఏఐ సాయం కూడా తీసుకుంటున్నారు. సౌతాఫ్రికాలోని గోయె అటవీ ప్రాంతంలో ఉన్న సైకాడ్‌ జాతికి చెందిన ఈ అరుదైన చెట్లు డైనోసర్ల కంటే ముందు నుంచి భూమి మీద ఉన్నాయి. అంతరించి పోయే ప్రమాదం ఉండటంతో సహజ పద్ధతిలో పునరుత్పత్తి చేయాలని భావిస్తున్నారు.