వేగంగా వెళ్తున్న ఓ యువకుడిని ఆపి పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. దీంతో మనస్తాపం చెందిన సదరు యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్- బెంగుళూరు హైవేపై శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్‌గేట్ వద్ద నిన్న చోటు చేసుకుంది. యువకుడిని ఆపి తనిఖీలు నిర్వహించిన పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకోగా అతడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పి, అతడిని కాపాడారు.