AP: ఇంద్రకీలాద్రి కొండపై సర్ప నాగు కలకలం రేపింది. ఓవైపు దసరా ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు కొండచరియల పై నుండి పాము రావడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. ఆదివారం సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము కనిపించడంతో భక్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.