కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదంపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీలకు పాల్పడిన ఎవరినైనా వదలద్దని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం గుంతకల్లులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డూలో కల్తీ చేయడం నేరం, టెర్రరిస్టులు కూడా ఇంతటి దారుణాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన అన్నారు.