బిగ్‌బాస్ సీజన్-7 తెలుగు ప్రసారానికి రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి దీన్ని ప్రసారం చేయనున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి మహేష్ అచంట, మహేశ్ కాలిదాస్, సాగర్ (మొగలిరేకులు ఫేం), యువ సామ్రాట్, అనిల్ గీలా, అన్షూ రెడ్డి, మోహన భోగరాజు, జబర్దస్త్ నరేష్ వంటి వారు ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే వారు పలు కారణాల వల్ల వెనుతిరిగారు.