కేంద్రం తెచ్చిన కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని లిబర్టీ వద్ద ముస్లింలు నిరసనలు చేపట్టారు. ఈ చట్టం వక్ఫ్ ఆస్తుల హక్కులను కాలరాస్తుందని, ముస్లిం సమాజ అవసరాలకు విరుద్ధమని ఆరోపిస్తూ, పాత వక్ఫ్ చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రోడ్లపై ర్యాలీలు, నినాదాలతో నిరసనకారులు తమ వ్యతిరేకతను తెలియజేశారు.