అక్రమంగా నివసిస్తున్న అఫ్గానీయులపై పాకిస్థాన్ బహిష్కరణ వేటు వేస్తోంది. 2023 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 8.60 లక్షలకుపైగా అఫ్గాన్ శరణార్థులు పాక్‌ను వీడినట్లు తెలిసింది. అఫ్గాన్ సిటిజన్ కార్డు (ACC) ఉన్నవారంతా మార్చి 31 నాటికి తమ దేశం విడిచి వెళ్లాలని, లేదంటే బహిష్కరణ వేటు తప్పదని జనవరిలో పాకిస్థాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 9 వేలమంది స్వచ్ఛందంగా వెళ్లిపోగా.. 6 వేల మందిని పాక్ బహిష్కరించింది.