బీహార్‌లో పెళ్లికి వెళ్లిన వారికి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్‌లో ఓ వివాహ ఊరేగింపుకు హాజరైన 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే 2016 నుంచి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే, పెళ్లికి హాజరైన వారంతా మద్యం సేవించడంతో ఈ అరెస్టులు జరిగాయి. ఇంకా వివాహ వేడుకకు హాజరైన వారు ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడానికి మద్యం బాటిళ్లను కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో 40 మందితో పాటు మద్యాన్ని అమ్మిన ఏడుగురు వ్యాపారులను అరెస్ట్ చేశారు.