భార్యతో విడాకులు తీసుకోవడంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ స్పందించారు. 'మేము మా బంధంలో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవాలనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఇది ముగిసింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. విడిపోవడంలోనూ మేము అర్థాన్ని వెతుకుతాము. అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్లీ ఒక్కటి కాలేకపోవచ్చు. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు.