భూమి నాలుగు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ నాలుగు పొరలు ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్‌గా ఉంటాయి. క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్ఫియర్ అంటారు. ఈ 50 కి.మీ మందపాటి పొర అనేక భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు.. మనకు భూప్రకంపనలు సంభవిస్తాయి.