38వ జాతీయ క్రీడల నిర్వహణ తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) జాతీయ క్రీడల తేదీ, జాబితాను విడుదల చేస్తూ అధికారిక లేఖను విడుదల చేసింది. ఈ క్రీడలకు ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇవ్వనుండగా జనవరి 28, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 32 ఒలింపిక్ క్రీడలతో పాటు ఉత్తరాఖండ్‌లోని నాలుగు స్థానిక క్రీడలను చేర్చింది.